విజయవాడ: మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రాసిక్యూషన్‌కు రాష్ట్ర ప్రభుత్వమే అడ్డుపడుతోందని తెలుగుదేశం సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆరోపించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర సంపదను దోచిన 26 జీవోలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. జగన్ అవినీతికి పాల్పడినందునే సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వలేదన్నారు.




