Tuesday, 3 November 2026

ధోనిపై అనంతపురంలో కేసు నమోదు

అనంతపురం, (జనంసాక్షి:) టీమిండియా కెప్టెన్‌ ధోనిపై అనంతపురం కోర్టులో సోమవారం పిటిషన్‌ దాఖలైంది. ఓ వారపత్రికలో ధోనీని విష్ణుమూర్తిగా పోల్చడంపై అభ్యతంరం వ్యక్తం చేస్తూ వీహెచ్‌పీ జనరల్‌ సెక్రటరీ శ్యాంసుందర్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని ఆయన తన పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. పిటిషన్‌ విచారణకు స్వీకరించింన కోర్టు వారపత్రిక ఎడిటర్‌, ధోనీపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *