హైదరాబాద్: టీఆర్‌ఎస్ కార్యక్రమాల్లో అన్నీ తానై వ్యవహరించే భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, మొన్న జరిగిన ప్లీనరీ ఏర్పాట్లలో మాత్రం ఎక్కడా కనిపించలేదు. ప్లీనరీ కోసం ఏర్పాటు చేసిన ఏడు కమిటీల్లో కూడా ఎందులోనూ ఆయన లేరు. ఈ విషయం పార్టీలో ఇప్పటికే చర్చనీయాంశంకాగా… శుక్రవారం నాటి ప్లీనరీ వేదికపై హరీశ్ కనిపించక పోవడం స్టేడియంలో హాట్ టాపిక్‌గా మారింది.
కేటీఆర్‌తో హరీష్‌కు కొంత అంతరం
మరో మంత్రి కేటీఆర్‌తో హరీష్‌కు కొంత అంతరం ఏర్పడిందని, ఇద్దరి మధ్య పొసగడం లేదన్న ప్రచారం.. పార్టీ వర్గాల్లో ఉంది. ఒక విధంగా వీరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందనే బలమైన అభిప్రాయం కూడా ఉంది. ప్లీనరీ బాధ్యతల నుంచి హరీశ్‌రావును అందుకే దూరం పెట్టారని కొందరు చెబుతున్నారు.
ఇద్దరి మధ్యవార్ తగ్గించే ప్రయత్నం చేసిన కేసీఆర్
సోమవారం జరిగిన బహిరంగం సభలో.. వీరిద్దరి మధ్యవార్‌ను తగ్గించే ప్రయత్నం చేశారు అధినేత కేసీఆర్. అయినా అందరితో కలివిడిగానే ఉన్నట్లు కనిపించినా.. చివరి వరకు విడిగానే ఉన్నారు హరీశ్‌రావు. ఒకరకంగా ఈ వార్తలన్నింటికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు సభావేదిక మీదకు అందరికంటే ముందుగానే వచ్చారు హరీశ్‌రావు. అయితే.. అక్కడికి వచ్చిన నేతలకు హరీష్ కరచాలనం ఇచ్చేందుకు ప్రయత్నించినా.. వారు రెస్పాండ్ కాకపోవడంతో.. ఆయన కామ్‌గా వేదికపై కూర్చున్నారు. ఆ తర్వాత ఎవ్వరొచ్చినా.. చివరకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వచ్చినా.. సెల్‌తో కాలక్షేపం చేశారే తప్పా.. కనీసం స్పందించలేదు హరీశ్‌రావు. కేటీఆర్ జనసందోహంలోనుంచి వస్తున్నప్పుడు కూడా.. తన లోకంలోనే ఉన్నారు తప్ప… సభ మూడ్‌లోకి రాలేకపోయారు హరీశ్‌రావు.
హరీశ్ రావును పొగిడిన సీఎం
ఇక అధినేత ఏమనుకున్నారో ఏమో.. ఏకంగా అల్లుడ్ని తన పదునైన పొగడ్తలతో అందలం ఎక్కించారు. వాటికి తన ముఖంలో చిరునవ్వును చిందించడానికి కూడా ఎంతో కష్టపడ్డారు హరీశ్‌రావు.
హరీశ్‌రావు పేరు వినపడగానే.. కార్యకర్తల ఈలలు-కేకలు
అటు ప్లీనరీ నుంచి బహిరంగసభ వరకు కూడా.. హరీశ్‌రావు పేరు వినపడగానే.. కార్యకర్తల ఈలలు, కేకలతో హోరెత్తించారు. నాడు తన వాక్‌చాతుర్యంతో ఏ అంశమైనా పార్టీకి అండగా నిలబడే హరీశ్‌రావు గొంతు మూగబోయిందే అంటూ.. కొందరు కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉండే… కేటీఆర్, హరీశ్‌రావుల మధ్య.. మంత్రులు తుమ్మల, జగదీశ్‌రెడ్డిల మంతనాలు కూడా ఫలించలేదు. సభలో సెల్‌ఫోన్‌లను చూస్తూ.. అలా ఉన్నారే తప్పా… కనీసం పకలరించుకో లేదు. అసలు వీరిద్దరికీ నంబర్ 2 పోజిషన్ దగ్గరే పొసగడం లేదని పార్టీ వర్గాల్లో టాక్. మరి ఈ కలివిడి తనం.. ఉద్యమపార్టీని ఎంతదూరం తీసుకెళుతుందో చూడాలి.
నంబర్ 2 పోజిషన్ నీదా, నాదా? హరీష్-కేటీఆర్




