Wednesday, 4 November 2026

నగదు రహితం దిశగా రాష్ట్రం

పాలనలో kcrcm-609-26-1472196121మూసపద్ధతి విడనాడాలి. ప్రతీ జిల్లాలో ఒకే పద్ధతి అవసరం లేదు. జిల్లాల స్వరూపం, స్వభావం, నైసర్గిక పరిస్థితులు, వాతావరణం, వనరుల ఆధారంగా జిల్లా ప్రణాళికను సిద్ధం చేయాలి. నో యువర్ డిస్ట్రిక్ట్, ప్లాన్ యువర్ డిస్ట్రిక్ట్ అనే పేరుతో ఏ జిల్లాకు ఆ జిల్లా ప్రణాళిక ఉండాలి. స్థానిక వనరులను గుర్తించి, వాటిని సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం. సిద్దిపేటలో నగదురహిత లావాదేవీలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్రమంతా ఇలాగే జరుగాలి. బ్యాంక్ లావాదేవీలు, ఆన్‌లైన్, మొబైల్ యాప్‌ల వినియోగం పెరుగాలి. త్వరలోనే టీ వ్యాలెట్ కూడా వస్తుంది. వీటన్నింటిపై అన్ని వర్గాలకు అవగాహన కల్పించాలి. అంతిమంగా తెలంగాణను నగదు రహిత రాష్ట్రంగా మార్చాలి అని తెలంగాణ సీఎం కెసిఆర్ అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కలెక్టర్ల తొలి సమావేశం బుధవారం ప్రగతి భవన్‌లో 11 గంటలపాటు సుదీర్ఘంగా కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకున్న సీఎం.. వారికి వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు మరింత సమర్థవంతంగా అమలుకావాలనే ఉద్దేశంతోనే కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని, వాటి ఫలితాలు ప్రజలకు అందాలంటే అధికార యంత్రాంగం మరింత క్రియాశీలకంగా ఉండాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర వర్గాల పేదల కోసం అమలుచేసే కార్యక్రమాలను నిత్యం పర్యవేక్షించాలని ఆదేశించారు. పూర్తి నగదు రహిత లావాదేవీల కోసం సిద్దిపేటలో పైలట్ ప్రాజెక్టు అమలు చేస్తున్నామని, అక్కడి అనుభవాలు ఉపయోగించుకొని, తెలంగాణను నగదు రహిత రాష్ట్రంగా మార్చాలన్న కేసీఆర్.. కలెక్టర్లు పోటీపడి ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలని పిలుపునిచ్చారు. గ్రీవెన్స్‌డే మొక్కుబడిగా సాగవద్దని కేసీఆర్ స్పష్టంచేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *