Wednesday, 4 November 2026

నగదు రహిత గ్రామంగా ఇబ్రహీంపూర్‌

దేశంలోని రెండో నగదు రహిత గ్రామంగా తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట నియోజకవర్గం ఇబ్రహీంపూర్‌ను తీర్చిదిద్దినందుకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు రాష్ట్రమంత్రి హరీశ్‌రావుకు ట్విharish-1024x768ట్టర్‌లో అభినందనలు తెలిపారు. నీళ్లు, రేషన్‌, కిరాణా సరకులు సహా..అన్ని నిత్యవసరాలు కార్డు ద్వారానే జరిగేలా కృషి చేస్తున్న గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నగదు రహిత లావాదేవీలతో ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. స్పందించిన హరీశ్‌రావు..సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు త్వరలోనే నియోజకవర్గాన్ని పూర్తిస్థాయి నగదురహిత లావాదేవీలు జరిగేలా తీర్చిదిద్దుతానంటూ’ కేంద్ర మంత్రికి ట్విట్టర్‌ వేదికగా హామీ ఇచ్చారు. కేంద్రం రూ.500, 1000 నోట్లు రద్దు చేసిన దరిమిలా నగదు కష్టాలు తీర్చే ఉద్దేశంతో ఇబ్రహీంపూర్‌ను నగదు రహితంగా మార్చేందుకు మంత్రి హరీశ్‌రావు చొరవచూపారు. ఈ విషయం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ దృష్టికి వెళ్లగా..ఆయన కూడా ఈ విషయమై రాష్ట్ర ఎంపీలను ఆరా తీశారు. ఈ అంశాన్ని ప్రధాని మోదీ దృష్టికి కూడా తీసుకెళ్లారు. వివిధ అంశాల్లో ఆదర్శంగా నిలిచిన ఇబ్రహీంపూర్‌ ఈ సంవత్సరం జాతీయ సశక్తికరణ్‌ పురస్కారం అందుకుంది. తాజాగా నగదు రహిత గ్రామంగా మారి జాతీయ గుర్తింపు తెచ్చుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *