హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం వెంటనే రోడ్ ట్రాన్స్ పోర్టు అండ్ సేఫ్టీ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఆటో కార్మిక ట్రేడ్ యూనియన్ నాయకులు హైదరాబాద్ నగరంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోకపోతే..ఆటో యూనియన్లతో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని యూనియన్ నాయకులు హెచ్చరించారు. ఈ ర్యాలీకి మద్దతుగా టీఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు.
నగరంలో ఆటో కార్మికుల భారీ ర్యాలీ..





