హైదరాబాద్ : పార్లమెంటరీ కార్యదర్శులపై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. శుక్రవారం న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వనుంది. పీఎస్‌ల నియామకాన్ని సవాల్ చేస్తూ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. రాజకీయ పునరావాసం కోసమే కేబినెట్ హోదా కల్పించారంటూ గుత్తా సుఖేందర్, రేవంత్ రెడ్డి పిటీషన్ దాఖలు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే… పిటీషన్ వేశారని తెలంగాణ అడ్వకేట్ జనరల్ వాదించారు. మంత్రులకు, అధికారులకు పీఎస్‌లు సాయంగా ఉంటారని ఆయన కోర్టుకు తెలిపారు.
పార్లమెంటరీ కార్యదర్శులపై వాదనలు పూర్తి..




