పెళ్లి ఇంట చావు బాజా..

chathis-gudఛత్తీస్‌గఢ్‌ : రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నూతన జిల్లా బల్లోడ్‌లోని అరందస్క గ్రామం వద్ద ఓ పెళ్లి వ్యాను బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వ్యానులో ప్రయాణిస్తున్న 30 మందిలో 11 మంది అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు గుర్తించి క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.