నగరాల అభివృద్దిపై 15న సదస్సు
విజయవాడ,జూలై13(జనం సాక్షి): పట్టణ ప్రాంత సమస్యలపై సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన విజయవాడ వేదిక ఫంక్షన్ హాలులో పాలక వర్గాల వైఖరిని నిరసిస్తూ ప్రత్యామ్నాయ విధానాల రూపకల్పనకై రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. పట్టణాల సమగ్రాభివృద్ధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ అన్నారు. పట్టణాభివృద్ధికి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని అన్నారు.