Friday, 6 November 2026

సిఎం కావాలన్నది జగన్‌కు పగటి కలే కాగలదు: ప్రత్తిపాటి

గుంటూరు,జూలై13(జ‌నం సాక్షి): వైకాపా అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సిఎం కావాలన్న పగటికల నెరవేరదని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. జగన్‌ ఎప్పటికీ సీఎం కాలేరని, అది పగటి కలగానే మిగిలిపోతుందని అన్నారు. జగన్‌కు డబ్బు విూద ప్రేమ తప్ప.. ప్రజలు, రైతులు, నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంపై ఆలోచనలేదని ఆరోపించారు. ప్రజారంజకంగా పాలిస్తున్న చంద్రబాబుకు, అవినీతిపరుడైన జగన్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. ఏ రాష్ట్రంలో అమలు చేయనటువంటి సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలుచేస్తున్నట్టు చెప్పారు. అందుకే సీఎం పీఠం విూద కూర్చోవాలన్న వైసీసీ అధ్యక్షుడు జగన్‌ కల ఎప్పటికీ నెరవేరదని మంత్రి ప్రత్తిపాటి అన్నారు. సీఎం చంద్రబాబును తిట్టడం కోసమే జగన్‌ పాదయాత్ర ర్వహించినట్లు ఉందని, ప్రజా సమస్యలపై పోరాటం చేసేలా లేదని, నిర్మాణాత్మకమైన చర్చలు జరగలేదని అన్నారు. వైఎస్‌ పక్కన తన ఫోటో ఉండాలని జగన్‌ అంటున్నారని, 30 ఏళ్లు సీఎంగా పాలన చేయాలని ఉందని అంటున్నారంటే… అది సాకారం అయ్యే కలకాదని మంత్రి అన్నారు.