నటుడు శివాజీ టిడిపి పెయిడ్ ఆర్టిస్ట్
జగన్‌పై రెక్కీ వార్తలపై వివరణ ఇవ్వాలి
సుధాకర్ బాబు డిమాండ్
విజయవాడ,సెప్టెంబర్15(జనంసాక్షి): నటుడు శివాజి టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్ అని ఆ పార్టీ అధికార ప్రతినిధి సుధాకర్ బాబు మండిపడ్డారు. గుంటూరులో తమ అధినేతపై రెక్కి జరిగిందన్న ఈ పెయిడ్ ఆర్టిస్ట్.. మళ్లీ దాడి జరగబోతుందని తెలిపాడని, ఈ పెయిడ్ ఆర్టిస్ట్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయం తెలుస్తుందన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎవరు కుట్ర పన్నారో చెప్పాలని సుధాకర్ బాబు డిమాండ్ చేశారు. శనివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. 2010 ఉపఎన్నికల్లో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు నాందేడ్ ప్రాంతంలో పర్యటించారని, అప్పుడు చేసిన ధర్నాపై కేసు నమోదు అయిందన్నారు. ఆ సమయంలో కాంగ్రెస్, టీడీపీ ఆడిన మహా డ్రామాపై.. మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారన్నారు. ఇది కేవలం స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసని, బెయిల్ తీసుకుంటే ఇది కేసే కాదన్నారు. కానీ ఈ పెయిడ్ ఆర్టిస్ట్ ఎదో జరిగినట్లు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని విమర్శించారు. గరుడ ఆపరేషన్‌ను ఎవరు ఆపరేట్ చేస్తున్నారో ఈ పెయిడ్ ఆర్టిస్ట్ చెప్పాలన్నారు. ప్రతిసారి రాష్ట్రంపై కుట్ర జరుగుతుందని చెబుతుంటే నిఘా వర్గాలు ఏమి చేస్తున్నాయని సుధాకర్ బాబు ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ఓ రాజకీయ వెన్నుపోటు దారుడని విమర్శించారు. జాతీయ విూడియా సర్వేలో 43 శాతం మంది వైఎస్ జగనే సీఎం అని చెబుతుంటే దానిని నుంచి ప్రజలను దృష్టిని మళ్ళించడానికే ఈ పెయిడ్ అర్టిస్టు హడావుడని తెలిపారు. ఐటీని చంద్రబాబే అభివృద్ధి చేశారని చెబుతున్న ఈ పెయిడ్ ఆర్టిస్ట్.. ఈ విషయం హైదరాబాద్‌లో చెబితే అసలు విషయం తెలుస్తుందన్నారు. ఈ పెయిడ్ ఆర్టిస్ట్ ఎందుకు ప్రతినెల అమెరికా వెళ్తున్నాడో సమాధానం చెప్పాలన్నారు. ఈ పెయిడ్ ఆర్టిస్ట్ ఓ కులగజ్జి అని, ఇలా ప్రవర్తిస్తేనే సొంత ఊరునుంచి తరిమికొట్టారని మండిపడ్డారు.