మాజీ మంత్రి, మంథని మాజీ ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబుకు.. నయీం కు సంబంధాలున్నాయని ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. నయీం గ్యాంగ్ తో కలిసి శ్రీధర్ బాబు చేసిన అరాచకాలకు సంబంధించిన ఆధారాలు.. తనను సైతం అంతమొందిస్తామన్న అతని అనుచరుల మాటల రికార్డులు తన వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. ఐనా శ్రీధర్ బాబు బుకాయించేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఎంక్వైరీకి సహకరించి, నిజానిజాలు బయటపడేందుకు సహకరించాలని డిమాండ్ చేశారాయన. హైదరాబాద్ లో డీజీపీ అనురాగ్ శర్మను కలిసిన ఎమ్మెల్యే పుట్ట మధు.. మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు, నయీంకు ఉన్న సంబంధాలపై ఫిర్యాదు చేశారు.
నయీం గ్యాంగ్‌తో శ్రీధర్ బాబు అరాచకాలు





