Tuesday, 3 November 2026

నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్‌

కడప: విదేశాలకు ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న నలుగురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను కడప పోలీసులు ఈరోజు అరెస్ట్‌ చేశారు. బద్వేల్‌ మండలం పీపీ కుంట చెక్‌పోస్ట్‌ వద్ద ఈరోజు ఉదయం వాహనాలు తనిఖీ చేస్తుండగా… లారీలో తరలిస్తున్న రూ.కోటి విలువైన 169 ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి మూడు వాహనాలు, స్కూటీతో పాటు 6 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరు బిహార్‌ రాష్ట్ర సరిహద్దుల గుండా నేపాల్‌కు ఎర్రచందనాన్ని స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు గుర్తించారు. నేపాల్‌కు చెందిన అంతర్జాతీయ స్మగ్లర్‌కు వీరంతా అనుచరులని పోలీసులు తెలిపారు. ఇటీవల అరెస్టయిన స్మగ్లర్లు అందించిన సమాచారం మేరకు వీరిపై నిఘా ఉంచి అరెస్ట్‌ చేసినట్లు జిల్లా ఎస్పీ నవీన్‌ గులాటి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *