రావూర్‌ఖిలా: ఖాండ్వా జైలు నుంచి తప్పించుకుపోయిన సిమి ఉగ్రవాదుల ముఠా ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. ఒడిశాలోని రావూర్‌ఖిల్లా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉంటున్న ఇంటిపై అర్థరాత్రి నల్గొండ పోలీసులు ఒడిశా పోలీసుల సహకారంతో దాడి చేశారు. సుమారు 3గంటల పాటు ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల అనంతరం ఎట్టకేలకు నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 5 పిస్తోళ్లు, బుల్లెట్లు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారు 2013లో మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జైలు నుంచి తప్పించుకున్న సిమి ఉగ్రవాదులుగా గుర్తించారు. ఖాండ్వా జైలు నుంచి ఆరుగురు ఉగ్రవాదులు తప్పించోకోగా, గతేడాది ఏప్రిల్‌లో నల్గొండ జిల్లాలో పోలీసుల ఎదురుకాల్పుల్లో ఉగ్రవాదులు ఎజాద్, అస్లామ్ హతమయ్యారు. మిగిలిన అబూ ఫైజల్, మహబూబ్, అంజాద్, జకీర్‌లు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. నలుగురు ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు ఒడిశా డీజీపీ కేబీసింగ్ ప్రకటించారు.తెలంగాణ పోలీసులను అభినందించిన రాజ్‌నాథ్‌సింగ్ నలుగురు సిమి ఉగ్రవాదులు అరెస్టు
రావూర్‌ఖిలా: ఖాండ్వా జైలు నుంచి తప్పించుకుపోయిన సిమి ఉగ్రవాదుల ముఠా ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. ఒడిశాలోని రావూర్‌ఖిల్లా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉంటున్న ఇంటిపై అర్థరాత్రి నల్గొండ పోలీసులు ఒడిశా పోలీసుల సహకారంతో దాడి చేశారు. సుమారు 3గంటల పాటు ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల అనంతరం ఎట్టకేలకు నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 5 పిస్తోళ్లు, బుల్లెట్లు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారు 2013లో మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జైలు నుంచి తప్పించుకున్న సిమి ఉగ్రవాదులుగా గుర్తించారు. ఖాండ్వా జైలు నుంచి ఆరుగురు ఉగ్రవాదులు తప్పించోకోగా, గతేడాది ఏప్రిల్‌లో నల్గొండ జిల్లాలో పోలీసుల ఎదురుకాల్పుల్లో ఉగ్రవాదులు ఎజాద్, అస్లామ్ హతమయ్యారు. మిగిలిన అబూ ఫైజల్, మహబూబ్, అంజాద్, జకీర్‌లు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. నలుగురు ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు ఒడిశా డీజీపీ కేబీసింగ్ ప్రకటించారు.తెలంగాణ పోలీసులను అభినందించిన రాజ్‌నాథ్‌సింగ్ 



