Wednesday, 4 November 2026

నల్లగొండ జిల్లాలో విస్తృతంగా తనిఖీలు

69abz7tvనల్లగొండ : జిల్లాలోని జానకీపురం ఎన్ కౌంటర్ లో ఇద్దరు సిమి ఉగ్రవాదులను పోలీసులు మట్టుబెట్టిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. జిల్లా నుంచి ఇతర జిల్లాలకు వెళ్లే దారులన్నింటి వద్ద పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అర్వపల్లి గుట్టలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. అయితే కాండ్వా జైలు నుంచి ఐదుగురు సిమి ఉగ్రవాదులు తప్పించుకున్నారు. జానకీపురం ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఈ నెల 2వ తేదీన ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఓ వ్యక్తి వచ్చినట్లు రైల్వే టికెట్ లభ్యమైంది. మరీ సూర్యాపేటలో కాల్పులు జరిపింది 1వ తేదీ అర్ధరాత్రి. అయితే మూడో వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. రైల్వే టికెట్ దర్యాప్తులో కీలకం కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *