సీఎం కేసీఆర్ సెక్రటేరియట్‌లోని నల్ల పోచమ్మ ఆలయాన్ని సందర్శించారు. ముఖ్యమంత్రికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కొత్త గుడి నిర్మించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా సీఎం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక హోమంలో ఆయన పాల్గొన్నారు. సచివాలయంలోని నల్ల పోచమ్మ ఆలయానికి వందేళ్ల చరిత్ర ఉంది. మూడేళ్ల కిందటే పాత గుడి స్థానంలో కొత్త గుడిని నిర్మించారు.
నల్లపోచమ్మ ఆలయంలో సీఎం పూజలు




