నష్టం లేదంటూనే పాదయాత్రపై భయమెందుకు?
విశాఖపట్టణం,నవంబర్11(జనంసాక్షి): అసెంబ్లీలో విపక్షం లేకున్నా నష్టం లేదంటున్న వారు వైఎస్ జగన్ పాదయాత్రతో ఎందుకు ఉలిక్కి పడుతున్నారని వైసిపి నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయ
ప్రసాద్ అన్నారు. జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర తో తెలుగుదేశం పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను చేపట్టిన తెలుగుదేశం పార్టీకి ప్రజలు 2019 ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హావిూని టిడిపి ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులను మాట్లాడకుండా చేసి ఏకపక్షంగా అధికార టిడిపి వ్యవహరిస్తోందన్నారు. అందుకే అసెంబ్లీ సమావేశాలను తమ పార్టీ బహిష్కరించిందని చెప్పారు.