Wednesday, 4 November 2026

నామినేషన్లు దాఖలు చేసిన దేవీప్రసాద్‌, పల్లా రాజేశ్వర్‌రెడ్డి

33A

హైదరాబాద్‌,ఫిబ్రవరి25(జనంసాక్షి):  పట్టభద్రుల నియోజకవర్గాలకు జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకోసం బుధవారం  టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు అట్టహాసంగా నామినేషన్‌ దాఖలు చేశారు. భారీగా మంత్రులను మొహరించి నామినేషన్లను వేయించారు. దీంతో నామినేషన్ల ఘట్టం అదిరేలా చేశారు. గులాబీ రెపరెపలు, తెలంగాణనినాదాలు మార్మోగాయి. కెసిఆర్‌ జిందాబాద్‌ నినాదాలో ¬రెత్తాయి.   మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా ఉద్యోగ సంఘాల నేత దేవీ ప్రసాద్‌, ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా విద్యాసంస్థల అధినేత పల్లా రాజేశ్వర్‌రెడ్డిలు నామినేషన్‌ దాఖాలు చేశారు. మంత్రులు, పార్లమెంటరీ కార్యదర్శులు, పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. భారీ ఊరేగింపులతో వెళ్లీ ఇద్దరూ నామినేషన్లు దాఖలు చేశారు. హైదరాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో దేవీప్రసాద్‌, నల్గొండలోని జిల్లా కలెక్టరేట్‌లో పల్లా రాజేశ్వర్‌రెడ్డి తమ నామినేషన్లను దాఖలు చేశారు. రెండు చోట్లా పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. గన్‌పార్క్‌ వద్ద అమరవీరుల స్థూపానికి దేవీప్రసాద్‌ తొలుత నివాళులర్పించారు. అనంతరం అక్కన్నుంచి నామినేషన్‌ వేయడానికి లిబర్టీలోని జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి నామినేషన్‌ వేయడానికి ర్యాలీగా బయలుదేరారు.

హాజరైన మంత్రులు..గెలిపించాలని వినతి

రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గానికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆఆర్‌ఎస్‌ పార్టీ తరపున జీ. దేవీప్రసాద్‌ బుధవారం అట్టహాసంగా నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, మహేందర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ , పార్టీ కార్యకర్తలు, ఉద్యోగ సంఘాల నేతలు తదితరులు హాజరైయ్యారు. అంతకు ముందు గన్‌పార్క్‌ వద్ద అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి ర్యాలీగా జిహెచ్‌ఎంసి కార్యాలయానికి వచ్చి నామినేషన్‌ వేశారు. వేలాదిగా టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు తరలిరాగా, జై తెలంగాన నినాదాలు మార్మోగాయి.  పట్టభద్రుల నియోజవర్గానికి టీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేస్తున్న దేవీప్రసాద్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. దేవీప్రసాద్‌ నామినేషన్‌ కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ శ్రేణులు, విద్యావంతులు అందరు కలిసి దేవీప్రసాద్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి. ఉద్యమంలో దేవీప్రసాద్‌ పాత్ర కీలకం అన్నారు. సకలజనుల సమ్మె విజయవంతం చేసిన ఘనత దేవీప్రసాద్‌కు దక్కుతుందన్నారు.  ఉద్యోగుల కోసం దేవీప్రసాద్‌ చేసిన కృషి అందరికీ తెలుసు. జేఏసీ అభ్యర్థే దేవీప్రసాద్‌ మాత్రమేనని. జేఏసీకి వేరే అభ్యర్థి లేడని ఆయన పేర్కొన్నారు. మంత్రి తలసాని మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో సకలజనుల సమ్మెను తీవ్రస్థాయికి తీసుకుని వెళ్లి విజయవంతం చేసిన వ్యక్తి దేవిప్రసాద్‌ అని అన్నారు. సిఎం కెసిఆర్‌కు ఉద్యమంలో అండగా ఉండి తెలంగాణ సాధనలో కీలక భూమిక పోశించారన్నారు. అలాంటి వ్యక్తి ఉద్యోగుల కోసం పోరాడారని, ఇప్పుడు ప్రజల కోసం పోరాడుతారని అన్నారు. ఆయన గెలిపించి తెలంగానను బలోపేతం చేయాలన్నారు. మరోమంత్రి మహేందర్‌ రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్‌ ఆదేశాల మేరుకు దేవిప్రసాద్‌ పోటీ చేస్తున్నారని, పట్టభద్రులు ఆలోచించి దేవికి ఓటేసి గెలిపించాలన్నారు. ఆయన గెలుపు తెలంగాణకు ఎంతో అవసరమన్నారు. గత ఎన్నికల్లో విజయం సాధించినట్లే ఈ ఎన్నికల్లో కూడా టిఆర్‌ఎస్‌ ఘన విజయం సాధిస్తుందని మంత్రి అన్నారు. ప్రజలు టిఆర్‌ఎస్‌ వెంట ఉన్నారని అన్నారు. అన్ని జిల్లాల ప్రజల ఆదరాభిమానాలతోనే తాను ఈ స్థాయికి వచ్చానని, అందరు ఆశీర్వదించాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి దేవీప్రసాద్‌ కోరారు.  జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆర్‌ఎస్‌ తరపున నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. తనకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. ఉద్యమంలో నేను చేసిన కృషి అందరికీ తెలుసు. గత ఉద్యమాలు పాలకులకు వ్యతిరేకంగా జరిగినవే. అందరూ ఆశీర్వదించి గెలిపించాల్సిందిగా కోరుతున్నట్లు ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇంతవరకు తాను ఉద్యోగుల కోసం పోరాడానని, ఇక ఎమ్మెల్సీగా ప్రజల సమస్యల కోసం పోరాడుతానని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ కీలక పాత్ర పోషించారన్నారు. ఎన్నో ఏళ్ల తెలంగాణ కలను సాకారం చేసుకున్న మనం కెసిఆర్‌ చేస్తున్న అభివృద్దిలో భాగస్వామ్యం కావాల్సి ఉందన్నారు.

ఇక నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గానికి టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి నామినేషన్‌ అట్టహాసంగా, వేలాదిగా కార్యకర్తుల, నాయకులు తరలిరాగా బుదవారం దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు హరీశ్‌రావు, జగదీష్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, చందూలాల్‌ ఇతర నేతలు, భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నల్లగొండ పట్టణంలో ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్‌ వరకు ర్యాలీ సాగింది. అనంతరం నామినేషన్‌ దాఖలు చేశారు. నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గానికి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేస్తున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిరుద్యోగుల సమస్యలు తెలిసిన విద్యావంతుడైన రాజేశ్వర్‌రెడ్డిని గెలిపిస్తేనే నిరుద్యోగుల సమస్యలు పరిష్కారమవుతాయి. అందరం కలిసికట్టుగా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించుకుందాం. టీడీపీ మద్దతు తీసుకున్న బీజేపీని ఓడించాలి. సీఎం ఇచ్చిన ఫిట్‌మెంట్‌తో ఉద్యోగులు సంతోషంగా ఉన్నరు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీడీపీకి బుద్ది చెప్పాలని ఆయన పేర్కొన్నారు. పల్లాను గెలిపించి మన కలలను సాకారం చేసుకుందామన్నారు. అందరి సమస్యలు తెలిసిన విద్యావంతుడు పల్లా అని అన్నారు. ఆయన గెలుపు వల్ల ఈ ప్రాంత ప్రజలు,నిరుద్యోగుల సమస్యలపై పోరాడుతారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న దశలో ఈ ప్రాంత ఆకాంక్షలు పూర్తిగా నెరవేరాలంటే రాబోయే ఏ ఎన్నికల్లోనైనా టీఆర్‌ఎస్‌ పార్టీకే పట్టం కట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గానికి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేస్తున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. సీఎం సంక్షేమ కార్యక్రమాలను ప్రణాళిక బద్దంగా అమలు చేస్తున్నారు. పథకాలను మరింతముందుకు విజయవంతంగా తీసుకెళ్లడానికి అందరు సహకారం అందించాల్సిందిగా కోరుతున్నామని పేర్కొన్నారు. అందుకు పల్లాను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.  ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ.. పట్టభద్రులు భారీగా తరలిరావడం చూస్తుంటే పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపు ఖాయమనిపిస్తుందన్నారు. అయితే భారీ మెజార్టీ అవసరమన్నారు. విద్యావంతుడు అయిన పల్లాను గెలపింపచి తెలంగాణ సత్తా చాటాలన్నారు. . పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించుకుంటే పట్టభద్రుల సమస్యలు పరిష్కారమవుతయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ సమస్యల కోసం నిరంతరం పోరాడుఉతన్న వ్యక్తి పల్లా అని అన్నారు. మరోమంత్రి జగదీశ్‌ రెడ్డి మాట్లాడుతూ పల్లా గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఆంధ్రా పార్టీల పొత్తుతో నడుస్తున్న వారిని తిప్పి కొట్టాలన్నారు. తెలంగాణ ఏర్పాటుతో పాటు, దీని అభివృద్దికి గత 9 నెలలుగా సిఎం కెసిఆర్‌ కృషి చేస్తున్నారని అన్నారు. బంగారు తెలంగాణ కోసం అందరం కలసికట్టుగా ముందుకు సాగాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *