Tuesday, 3 November 2026

నార్పలలో రాతిదూలం లాగుడు పోటీలు

అనంతపురం,మార్చి3(జ‌నంసాక్షి): ఈ నెల 9వ తేదీన నార్పలలో జిల్లా స్థాయి రాతిదూలం లాగుడు పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకుడు గాండ్లపెరవళి రాము పేర్కొన్నారు. దివంగత జడ్పీటీసీ సభ్యుడు ఆకుల జయసింహ మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం  పోటీలను ఏర్పాటు చేశారు. ఈ పోటీల్లో పాల్గొనదలచినవారు ఈ నెల 8వ తేదీ సాయింత్రంలోపు నార్పలలో పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. ప్రథమ విజేతకు రూ.20,116, ద్వితీయ విజేతకు రూ.10,116, తృతీయ విజేతకు రూ.5116 లను  అందిస్తామని చెప్పారు. అదేరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *