Tuesday, 3 November 2026

ఎస్కె వర్సిటీ డిగ్రీ పరీక్షల షెడ్యూల్‌ ఖరారు

అనంతపురం,మార్చి3(జ‌నంసాక్షి): అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ పరీక్షల షెడ్యూల్‌ను అధికారులు  ఖరారు చేశారు. 18 నుంచి ఏప్రిల్‌ 14వ తేదీ వరకు పరీక్షలను  నిర్వహించాలని షెడ్యూల్‌ ఖరారు చేశారు. వర్సిటీ పరిధిలో మొత్తం 40వేలకు పైగా విద్యార్థులు హాజరుకాబోతున్నారు. జిల్లాలో 68 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షల షెడ్యూల్‌ను సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్లకు పంపామని  తెలిపారు. ఎస్కేయూ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. కర్నూలు జిల్లాలో స్లపిమెంటరీ విద్యార్థులకు కర్నూలులోని కేవీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలను పరీక్షా కేంద్రాలుగా నిర్ణయించామన్నారు.ఈనెల 18న ఆరంభమయ్యే డిగ్రీ ప్రథమ, ద్వితీయ, తృతీయ పరీక్షలు డిగ్రీ పరీక్షలు రోజుకు రెండు పరీక్షలు నిర్వహించనుండడంతో సుదీర్ఘంగా పరీక్షలు సాగనున్నాయి. తృతీయ, ప్రథమ సంవత్సరం పరీక్షల సమయాల్లో వ్యత్యాసంతో రోజుకు రెండు నిర్వహించాలని నిర్ణయించారు. యేటా ఇదేతరహాలోనే నిర్వహించడం ఆనవాయితీగా మారింది. పరీక్షలు ఎక్కువరోజులు అవుతాయనే ఉద్దేశంతో ఈసారి రెండు పరీక్షలు ఒకేరోజు నిర్వహించేలా షెడ్యూల్‌ సిద్దంచేశారు. ప్రథమ, తృతీయ సంవత్సరం పరీక్షలు ఒకరోజు చొప్పున ద్వితీయ సంవత్సరం పరీక్షలు మరుసటిరోజు నిర్వహిస్తారు. తృతీయ సంవత్సరం పరీక్షలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు కొనసాగుతాయి. ప్రథమ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయి. తృతీయ సంవత్సరం విద్యార్థుల్లో ప్రథమ సంవత్సరం ఫెయిల్‌ అయిన వారు వెంటనే పరీక్షలకు హాజరుకావాల్సిందే. ద్వితీయ సంవత్సరం పరీక్షలు మరుసటిరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *