Wednesday, 4 November 2026

నిఘా కనుసన్నల్లో అంకిత్‌ చవాన్‌ వివాహం

ముంబై, జూన్‌ 2 (జనంసాక్షి) :
ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ కుంభకోణంలో అరెస్టయిన రాజస్థాన్‌ రాయల్స్‌ క్రికెటర్‌ అంకిత్‌ చవాన్‌ ఓ ఇంటివాడయ్యాడు. తన స్నేహితురాలు నేహా సంబారీ మెడలో ఆదివారం మూడు ముళ్లు వేశారు. స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో అరెస్టయిన చవాన్‌ వివాహం కోసం తాత్కాలిక బెయిల్‌ ఇవ్వాలని కోర్టును కోరగా ఇటీవల జూన్‌ ఆరున కోర్టు బెయిల్‌ ఇచ్చింది. బెయిల్‌పై విడుదలైన చవాన్‌ కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో నేహా సంబారీని వివాహమాడాడు. స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో ఆరోపణలతో రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాళ్లు శ్రీశాంత్‌, అజిత్‌ చండిలా, అంకిత్‌ చవాన్‌ను గత నెలలో ఢల్లీి పోలీసులు అరెస్టు చేసిన విషయం విధితమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *