Monday, 2 November 2026

40 మంది భారత జాలర్లను విడుదలచేసిన పాక్‌

4

 

పంజాబ్‌, నవంబర్‌ 30 (జనంసాక్షి) : 40 మందిని భారత జాలర్లను పాకిస్తాన్‌ విడుదల చేసింది. వారిలో గుజరాత్‌కు చెందిన 35 మంది మత్స్యకారులు కూడా ఉన్నట్లు సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌) అధికారులు చెప్పారు. పాకిస్తాన్‌కు చెందిన సరిహద్దు భద్రతా దళం అధికారులు శనివారం ఖైదీలను అట్టారి-వాఘా చెక్‌పోస్ట్‌ వద్దకు తీసుకువచ్చారు. వారిని ఇక్కడి బీఎస్‌ఎఫ్‌ అధికారులకు అప్పగించారు. పాకిస్తాన్‌ జలాలలోకి వెళ్లినందుకు మత్స్యకారులను పాకిస్తాన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ 40 మంది ఖైదీలలో ఎక్కువ మంది ఏడాదిగా పాకిస్తాన్‌ జైళ్లలో ఉన్నారు. ఇటీవల జరిగిన సార్క్‌ శిఖరాగ్ర సమావేశంలో భారత్‌-పాక్‌ దేశాధినేతలు మొదటి రోజు ఎడముఖం పెడముఖంగా ఉండినప్పటికీ తర్వాత రోజు మాట్లాడుకోవడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. పొరుగు దేశాల మధ్య సత్ససంబంధాలు ఉండాలని దేశాధినేతలు ఆకాంక్షించిన తరుణంలో భారత జాలర్లను పాకిస్తాన్‌ విడుదల చేయడం ఆహ్వానించదగిన పరిణామంగా చెప్పవచ్చు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *