Monday, 2 November 2026

నిజాం సేవలు భేష్‌

4
కేసీఆర్‌ పొగడ్తలను సమర్థించిన షబ్బీర్‌

హైదరాబాద్‌,జనవరి3 , (జనంసాక్షి):  ఆస్పత్రుల నిర్మాణాలు, అభివృద్ది తదితర విషయంలో నిజాం రాజు గొప్పరాజు అన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చెప్పినమాటలతో పూర్తిగా ఏకీభవిస్తున్నట్టు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీమంత్రి  షబ్బీర్‌ అలి వ్యాఖ్యానించారు. తెలంగాణాలో ఆరోగ్యంకోసం నిజాం చేసిన కృషి చాలా ఉంది అని ఆయన శ్లాఘించారు. ఎన్నో ఆస్పత్రలు కట్టించడమే గాకుండా చెరువులు తవ్వించిన ఘనుడని అన్నారు. ఉస్మానియా, గాంధి , క్యాన్సర్‌ ఆస్పత్రి, నిలోఫర్‌ ఆస్పత్రి,, పాగల్‌ఖానా, చెస్ట్‌ ఆస్పత్రి … ఇలా మనిషికి ఎన్ని భాగాలు ఉన్నయో అన్ని ఆస్పత్రులు నిజాం కట్టించారని ఆయన గుర్తు చేశారు. నిజాంరాజు కట్టించినన్ని దవాఖానాలు మరే రాజూ కట్టించలేదని ఆయన అన్నారు.నిజాం చేసిన మిగిలిన విషయాలగురించి తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడను గాని నిన్నటి మాటలు మాత్రం ఒపకుంటానని ఆయన చెప్పారు. దేశంలో 300 మంది పైగా రాజులు ఉన్నా పేదల ఆరోగ్యం కోసం ఎవ్వరూ ఏవిూ చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఆరునెలల పాలనలో తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ చేసింది ఏవిూ లేదని ఆయన విమర్శించారు. కేసీఆర్‌ పాలనపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ పై విమర్శల వర్షం కురిపించారు. హైదరాబాద్‌ అభివృద్ది విషయంలో నిజాం పాలన ప్రశంసనీయమని ఆయన అన్నారు.హైదరాబాద్‌ లో ఆస్పత్రులన్నీ నిజాం కాలంలోనే నిర్మితమయ్యాయని షభ్బీర్‌ అన్నారు.నిజాం విషయంలో సమర్ధించిన షబ్బీర్‌ తిరిగి కెసిఆర్‌ ను విమర్శించకుండా ఉండలేదు.కెసిఆర్‌ ఏడు నెలలపాలనలో వారానికి ఒక కొత్త వాగ్దానం చేశారని, వాటిలో ఒక్కటి కూడా నెరవేర్చలేదని అన్నారు. హైదరాబాద్‌ ను గతంలో ఇస్తాంబుల్‌ చేస్తానని చెప్పిన కెసిఆర్‌ ఇప్పుడు డల్లాస్‌ చేస్తానంటున్నారని విమర్శించారు. హైదరాబాద్‌ కు కెసిఆర్‌ ఇచ్చిన హావిూల అమలుకు రెండు లక్షల కోట్లు కావాలని షబ్బీర్‌ లెక్కగట్టారు.  హైదరాబాద్ను అప్పట్లో ఇస్తాంబుల్‌ చేస్తానన్న…కేసీఆర్‌ ఇప్పుడు డల్లాస్‌ అంటున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌ అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ 20కి పైగా ఇచ్చిన హావిూల్లో ఒక్కటీ ప్రారంభం కాలేదని విమర్శించారు. కేసీఆర్‌ …హైదరాబాద్‌ హావిూల అమలుకు రెండు లక్షల కోట్లు అవసరం అన్నారు. వీటన్నిటిపైనా చిత్తశుద్ది లేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *