Tuesday, 3 November 2026

నిమ్స్ లో ఫిజియోథెరపీ విద్యార్థి ఆత్మహత్య

8హైదరాబాద్: నగరంలోని నిజామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(నిమ్స్) లో సోమవారం ఉదయం ఓ వైద్య విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిమ్స్ లో ఫిజియోథెరిపీ ఇంటర్న్ షిప్  చేస్తున్న విజయ్ కుమార్(24) అనే విద్యార్థి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిమ్స్ పాత బిల్డింగ్ లోని 6 ఫ్లోర్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

మృతుడి స్వస్థలం మెదక్ జిల్లా పటాన్ చెరువు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. అధికారులు విజయ్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆత్మహత్యకు గల కారణాలు, సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *