కాకినాడ,ఆగస్ట్4(జనం సాక్షి): తూర్పుగోదావరి జిల్లాలో వైకాపా అధినేత జగన్ పాదయాత్ర నిరసనల మధ్య కొనసాగుతోంది. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు శివారు నుంచి చేబ్రోలు విూదుగా జగన్ పాదయాత్ర శనివారం ఉదయం కొనసాగింది. కాపులకు రిజర్వేషన్లు కావాలంటూ చేబ్రోలు వద్ద యువకులు నిరసనలు తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శించి ఆందోళన చేపట్టారు. పలువురు మంచినీటి ట్యాంక్ ఎక్కి ఆందోళనకు దిగారు. జగన్ రాకముందే ముందస్తుగా వీరంతా నిరసనకు దిగడంతో పోలీసులు వీరిని అడ్డుకున్నారు.
మధ్యాహ్నం చేబ్రోలు శివారులో జగన్ భోజన విరామం తీసుకోనున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తూ పాదయాత్ర కొనసాగుతోంది.




