Monday, 2 November 2026

నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి

untitled-14
– ప్రొఫెసర్‌ కోదండరాం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 28(జనంసాక్షి):జవహార్‌ నగర్‌ ప్రభుత్వ భూమిలో నివసిస్తున్న నిరుపేదల ఇండ్ల స్థలాలను ప్రభుత్వం వెంటనే క్రమబద్దీకరించి 69 జీవో కింద ఇండ్ల పట్టాలు ఇవ్వాలని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొపెసర్‌ కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు.బుధవారం జవహార్‌నగర్‌ గ్రామంలో జవహార్‌నగర్‌ ప్రజాహక్కుల పరిరక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాదర్నాలో ముఖ్య అతిథిగా పాల్గొని జవహార్‌ నగర్‌ ఇండ్ల స్థలాల కోసం పోరాడే నిరుపేద ప్రజలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. గత 20 సంవత్సరాలుగా జవహార్‌ నగర్‌ ప్రజల సమస్య పరిష్కారానికి నోచుకోలేదని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతైన తమ బతుకులు మారుతాయని ఎన్నో కలలు  గన్న జవహార్‌నగర్‌ ప్రజల కోరిక  ేరలేదని తెలంగాణ ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా ఇక్కడ నివసిస్తున్న  ప్రజల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని అన్నారు. గ్రామంలోని భూములపై సుప్రీంకోర్టు లో కేసు చామని

చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం ఇది ప్రభుత్వ భూమి అయితే ఇక్కడ నివసిస్తున్న నిరుపేదల ఇండ్లకు నివాస హక్కు కల్పించాలని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వస్తే తమ బతుకులు మారుతాయని ప్రజలంతా తెలంగాణ  ప్రభుత్వాన్ని గెలిపిస్తే వారి ఆశలపై నీళ్లు చల్లడం సరైన చర్య కాదని ప్రభుత్వం వెంటనే జవహార్‌ నగర్‌ గ్రామంలో నివసిస్తున్న ప్రజలందరికి ఇండ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సభ ప్రారంభమైనప్పటి నుంచి సాయంత్రం వరకు ధర్నాలో పాల్గొన్నారు కోదండరాం. ఈకార్యక్రమానికి భారీగా తరలివచ్చిన మహిళల్ని అభినందిస్తూ  మహిళలు సంఘతితంగా ఉంటేనే ఆ కుటుంబంతో పాటు గ్రామం సమిష్టిగా ఉండి పోరాటం చేస్తే ఏదైనా సాధించవచ్చని అలా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న మనకు ఈ నివాస హక్కుల సమస్య చిన్న  సమస్య అని అన్నారు. ప్రభుత్వం స్పందించి ఇక్కడి ప్రజల సమస్యకు సరైన న్యాయం చేస్తామని ప్రకటిస్తే  ప్రజలంతా బతుకమ్మ దసరా దీపావళి పండుగను ఆనందంగా జరుపుకుంటారని జవహార్‌నగర్‌ గ్రామ ప్రజలు ఎన్నో ఏళ్లుగా డంపింగ్‌ యార్డు కాలుష్యంతో సతమతమవుతున్న ఇక్కడి ప్రజలకు మేధావుల సలహాతో ఈ  సమస్యను కూడా పరిష్కరించి ప్రజలకు మౌళిక సదుపాయాలు కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో

పాల్గొన్న పీవోడబ్య్లూ అధ్యక్షురాలు సంధ్య మాట్లాడుతూ వేల వేల ఎకరాలు ప్రభుత్వ జాగాలు కబ్జా చేసి ఆకాశాన్నంటే మేడలు కట్టిన దొంగలను వదిలి 80 గజాల స్థలంలో చిన్న చిన్న ఇండ్లు గుడిసెలు కట్టిన వారిని  బజారుకు గుంజడం మంచిది కాదని ఆమె అన్నారు. ప్రభుత్వం పెద్దలను వదిలి పేదలపై జులం చేస్తే సహించేది లేదని ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ఆమె హెచ్చరించారు. అన్యాయానికి గురయ్యే పేద  ప్రజల పక్షాన తాము పోరాడేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  పురుషోత్తం గోవర్ధణ్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. కృష్ణ, చింతా స్వామి, జీవరత్నం, బోయిని రాజమౌళితో పాటు మేడ రవి, చంద్రమౌళి, శివబాబు, అనురాధ, సునీత, స్వప్న జావేద్‌, రాజలక్ష్మి అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *