Tuesday, 3 November 2026

నిరుపేద ముస్లింలకు నిత్యావసరాల పంపిణీ

కరీంనగర్‌ టౌన్‌, ఆగస్ట్‌ 2(జనంసాక్షి): రంజాన్‌ మాసం పురస్కరించుకొని ముస్లిం సీనియర్‌ సిటిజన్స్‌ వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో గురు వారం నిరుపేద ముస్లింలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. నిరుపేద ముస్లింలు  పండుగను జరుపు కొనుటకు గత సంవత్సరం లాగే బియ్యం, చక్కర తదితర వస్తువులతో కూడిన నిత్యా వసర వస్తువుల ప్యాకెట్‌లలను దాదాపు 50 మందికి పంపిణీ చేసినట్లు సంస్థ అధ్యక్షులు మహ్మద్‌ అబిద్‌ హు స్సేన్‌, కార్యదర్శి మహ్మద్‌ ముస్తాఫా అలీ అన్సారీలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ముస్లిం సీనియర్‌ సిటి జన్స్‌ వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ చీఫ్‌ అడ్వైజర్‌ మహ్మద్‌ నసీమొద్దీన్‌, అడ్వైజరీ కమిటీ చైర్మన్‌ మహ్మద్‌ గియా సొద్దీన్‌, ఎక్స్‌పర్ట్‌ కమిటీ చైర్మన్‌ గులాం మొహియుద్దీన్‌, కో ఆర్డినేటర్‌ మహ్మద్‌ ఇక్రామొ ద్దీన్‌, లీగల్‌ అడ్వైజర్‌ గులాం రబ్బాని, ఎంఏ రవూఫ్‌, మహ్మద్‌ గాజియొద్దీన్‌, మగ్దూం మొహియుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *