నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని విస్మరించవద్దు

విజయవాడ,జూన్‌19(జ‌నం సాక్షి): భవన నిర్మాణ రంగం కార్మికుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించాలని కార్మిక సంఘాలు కోరాయి. సిమెంట్‌, ఐరన్‌, రంగులు, ఇతర ముడి సరుకుల ధరలు నియంత్రించి వాటిని ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. సంక్షేమ బోర్డులో ఉన్న నిధులు కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయకుండా ఇతర రంగాలకు మళ్లించడం సరికాదన్నారు. ఈ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించొద్దన్నారు. రాష్ట్రంలో లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పని చేస్తున్నారని తెలిపారు. ఇసుక పాలసీపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఇసుక దొరక్క పనులు లేక భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల పోషణ భారమై అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మరికొంత మంది వలసలు పోతు న్నారన్నారన్నారు. అడ్డాల ఏర్పాటు, ఆయా ప్రాంతాల్లో మౌ లిక వసతులు కల్పించాల్సిన లేబర్‌ శాఖ అధికారులు చోద్యం చేస్తున్నారని విమర్శించారు. పెట్టుబడిదారులు, బడా వ్యాపారులకు రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం కార్మికులకు మాత్రం కూలి పెంపు, రుణాలివ్వడం లేదన్నారు.