నిలకడగా ఎంపీ మాగంటి బాబు ఆరోగ్యం
విజయవాడ, మే5(జనం సాక్షి ) : పార్లమెంటు సభ్యుడు మాగంటి బాబు ఆరోగ్యం నిలకడగా ఉందని రమేష్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ రమేష్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… రెండు రోజుల చికిత్స తర్వాత స్టంట్ వేయాలా, వద్దా అనేది నిర్ణయిస్తామన్నారు. అలాగే మాగంటి బాబుకు 48 గంటల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని, నాయకులు, అభిమానులునులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆరేళ్ల క్రితం సీటీ యాంజియోగ్రామ్ టెస్ట్ చేసిన సమయంలో ఒక బ్లాక్ ఉందని, ఇప్పుడు రెండు బ్లాక్స్ ఉన్నందు వల్ల అనారోగ్యానికి గురయ్యారని డాక్టర్ రమేష్ తెలిపారు. శుక్రవారం ఎంపీ బాబు నిన్న గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. తెదేపా సైకిల్ యాత్రలో పాల్గొన్న ఆయన మధ్యాహ్నం సమయానికి ఇంటికి చేరుకున్నారు. ఎండలో సైకిల్ తొక్కడంతో తీవ్ర అవస్థతకు గురైన బాబును కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడకు తరలించారు.