రాయచోటి: కడప జిల్లా రాయచోటి పట్టణంలోని సాయిబాబా గుడి వద్ద నీటి ట్యాంకర్ ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. మృతురాలిని చిత్తూరు జిల్లా కేవీపల్లె మండలం మెకలపల్లెకు చెందిన తిమ్మమ్మ (60)గా గుర్తించారు. మహిళ చీపురుకట్టలు అమ్ముకోవడానికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.




