జల విధానం ద్వారా నీటి సమస్యకు స్వస్తి
తెలంగాణ నిరుద్యోగులకే ఉద్యోగాలు: కెసిఆర్
హైదరాబాద్,మార్చి31(జనంసాక్షి): పోరాటాల కారణంగానే తెలంగాణ ప్రజలు ఉద్యమ పార్టీ టీఆర్ఎస్కు అధికారం కట్టబెట్టారని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. అసెంబ్లీలో జల విధానంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సందర్భంగా ఆయన ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్‌పై అని గుర్తు చేశారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం 29వ రాష్ట్రంగా అవతరించిందని పేర్కొన్నారు. ఉద్యోగాలు తప్పకుండా కేంద్ర నిబంధనలు, రాజ్యాంగ నిబంధనల మేరకు తెలంగాణ నిరుద్యోగ యువతకే దక్కుతాయని స్పష్టం చేశారు నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం పుట్టిందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఎన్నో ఒడిదుడుకులు, పోరాటాలు, ఆత్మత్యాగాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆవిష్కృతమైందన్నారు. ఇప్పటి వరకు నిధులు, నియామకాల సమస్య చాలా వరకు తీరిందన్నారు. మిగిలింది నీళ్ల పరిష్కారమేనని పేర్కొన్నారు. నీటి సమస్య పరిష్కారానికి జల విధానం ద్వారా స్వస్తి పలుకుతామన్నారు. తెలంగాణ ఏర్పడంతోనే వనరుల సమస్య చాలా వరకు తీరిందన్నారు.
1969లో తెలంగాణ ఉద్యమం మూగబోయిందని, 2001లో మళ్లీ ఉద్యమం ఎగిసిపడిందన్నారు. విద్యుత్తు ఛార్జీలు పెంపు- తెలంగాణ ప్రజలకు ఉరిశిక్షగా మారడంతో తాను ఉద్యమించానని అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులన్నీ అంతరాష్ట్ర వివాదాలే ఉన్నాయని అన్నారు. తెలంగాణ కేటాయింపులు స్పష్టంగా ఉన్నాయి
గోదావరి, కృష్ణా జలాలపై కేటాయింపులు ఉన్నా పొలాలు తడవలేదన్నారు. ఈ రెండు నదులు కలిపి వెయ్యి టీఎంసీలపైనే రావాల్సి ఉందన్నారు. గోదావరిలో 954 టీఎంసీల నీరు కృష్ణాలో 299 నికర, 75 టీఎంసీల మిగులు జలాలు ఉన్నాయి. మేజర్, మైనర్ ప్రాజెక్టులకు నీళ్ల కేటాయింపులు ఉన్నా లాభం లేకుండా పోయింది. వాటర్ షెడ్‌కు కాకతీయులే ఆదర్శంగా నిలిచారని అన్నారు. నిజాంసాగర్ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్టు ఆసఫ్‌జాహీలు కట్టారన్నారు. ఇన్ని అవకాశాలు, సౌకర్యాలు ఉన్నా తెలంగాణ ఎడారిగా మారిందన్నారు.




