Monday, 2 November 2026

నూతన కానుకలు

C

– ఉద్యోగుల క్రమబద్ధీకరణ

– ఆస్తి పన్ను 101 రూ మాత్రమే

– డీఎస్సీ నియామకాలు

– సీఎం కేసీఆర్‌ వరాల జల్లు

హైదరాబాద్‌,జనవరి 1(జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నూతన సంవత్సరం కానుకగా వరాల జల్లు కురిపించారు. నూతన సంవత్సర కానుకగా కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ వరాలు ప్రకటించారు. కాంట్రాక్ట్‌ సిబ్బందిని క్రమబద్దీకరించాలని కూడాసీఎం నిర్ణయించారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో 50 వేల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. జనవరి 2న మంత్రివర్గ సమావేశంలో శాఖల వారీగా కాంట్రాక్ట్‌ ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల్లో ఒప్పంద ఉద్యోగులను కూడా క్రమబద్ధీకరించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు ఒప్పంద ఉద్యోగుల వివరాలను శాఖల వారీగా నివేదించాలని అధికారులను ఆదేశించారు. దీంతో కేబినేట్‌లో దీనికి సంబంధించి ఓకే చేసే అవకాశం ఉంది. వివిధ అంశాలపై ఆయన గురువారం మంత్రులు, అధికారులతో సవిూక్షించారు. ఇంందులో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులోభాగంగా డీఎస్సీ ఆశావాహులకు తెలంగాణ ప్రభుత్వ తీపి కబురు అందించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 15-20 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) పరిధిలోని నివాస గృహాల యజమానులకు తీపి కబురు అందించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో రూ.1,200, ఆలోపు వార్షిక ఆస్తి పన్ను చెల్లిస్తున్న పేద, మధ్య తరగతి నివాస గృహాల యజమానుల నుంచి ఇకపై రూ.101 మాత్రమే కడితే సరిపోతుంది.ఈ  మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు జీహెచ్‌ఎంసీలో

చట్టాన్ని సవరిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. కాగా గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ సర్కారు  గ్రేటర్‌ ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. ఈ నేపథ్యంలోనే గ్రేటర్‌ వాసులపై వరాల జల్లు కురిపిస్తోంది. అలాగే ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌ గడువును మరో నెల రోజుల పాటు ప్రభుత్వం పొడిగించింది.

మరోవైపు త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అంతేకాకుండా 9వేల కానిస్టేబుళ్ల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడనుంది. మొత్తంగా అన్ని విషయాలపై చర్చించి నిర్ణయించారు. సవిూక్షలో మంత్రులు కడియం శ్రీహరి,ఈటెల రాజేందర్‌,సిఎస్‌ రాజీవ్‌ శర్మ తదితరులు పాల్గోన్నారు.

ఆస్తి పన్ను రూ.1200 కాదు..రూ.101 మాత్రమే

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నూతన సంవత్సరం కానుకగా వరాల జల్లు కురిపించారు. హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) పరిధిలోని నివాస గృహాల యజమానులకు తీపి కబురు అందించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో రూ.1,200, ఆలోపు వార్షిక ఆస్తి పన్ను చెల్లిస్తున్న పేద, మధ్య తరగతి నివాస గృహాల యజమానుల నుంచి ఇకపై రూ.101 మాత్రమే కడితే సరిపోతుంది.ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు జీహెచ్‌ఎంసీలో చట్టాన్ని

సవరిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  కాగా గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ సర్కారు  గ్రేటర్‌ ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. ఈ నేపథ్యంలోనే గ్రేటర్‌ వాసులపై వరాల జల్లు కురిపిస్తోంది. అలాగే ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌ గడువును మరో నెల రోజుల పాటు ప్రభుత్వం పొడిగించింది.మరోవైపు త్వరలో డీఎస్సీ

నోటిఫికేషన్‌ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అంతేకాకుండా 9వేల కానిస్టేబుళ్ల భర్తీకి ఇవాళ నోటిఫికేషన్‌

వెలువడనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *