నెల్లూరు : నెల్లూరు జిల్లా ఆత్మకూరు బస్టాండు సమీపంలోని సర్వేపల్లి పంటకాల్వలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు కనుగొన్నారు. పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




