Wednesday, 4 November 2026

నెల్లూరు జిల్లాలో అగ్నిప్రమాదం… మహిళ మృతి

నెల్లూరు నేరవిభాగం: నెల్లూరు ఇరగాళ్లమ్మ సంఘంలో బుధవారం విద్యుదాఘాతంతో 6 పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో సుబ్బమ్మ(80) అనే వృద్ధురాలు మంటల్లో చిక్కుకుని సజీవదహనమైంది. ఇరగాళ్లమ్మ దేవస్థానం సమీపంలోని ఓ ఇంట్లో విద్యుదాఘాతం కారణంగా మంటలు చెలరేగాయి. స్థానికులు గుర్తించకపోవటంతో పక్కనే ఉన్న మరో ఐదు పూరిళ్లకు మంటలు అంటుకున్నాయి. ఇళ్లలో ఉన్న వారంతా ప్రమాదం నుంచి బయట పడ్డారు. సుబ్బమ్మ ఇంట్లో ఆమెతోపాటు మరో ముగ్గురు నివాసం ఉంటున్నారు. స్థానికులు ముగ్గురిని కాపాడారు. అయితే అనారోగ్యం, వృద్ధాప్యం కారణంగా మంచానికే పరిమితమైన సుబ్బమ్మను కాపాడలేకపోయారు. దీంతో సుబ్బమ్మ మంటల్లో చిక్కుకుని సజీవ దహనమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి చేశారు. సుమారు రూ.4లక్షల మేర ఆస్తి నష్టం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *