Tuesday, 3 November 2026

నెల్లూరు రవాణాశాఖ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

నెల్లూరు : నెల్లూరులోని రవాణాశాఖ కార్యాలయంలో అవినీతి నిరోధకశాఖ అధికారులు సోదాలు చేపట్టారు. రవాణాశాఖ ఏజెంట్ల వద్ద నుంచి ఏసీబీ అధికారులు 1.75 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. 15 మంది రవాణాశాఖ ఏజెంట్లను వారు అదుపులోకి తీసుకున్నారు. డీటీసీ సహా ఇతర అధికారులపై కేసులు పెట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *