అం
తర్జాతీయ సదస్సులో సోనియా, రాహుల్
హైదరాబాద్, నవంబర్ 18 (జనంసాక్షి) : భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఆలోచనలు ఉన్నతమైనవని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అభివర్ణించారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరగుతున్న నెహ్రూ అంతర్జాతీయ సదస్సులో వారు మాట్లాడారు. నెహ్రూను చరిత్ర నుంచి తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని రాహుల్‌గాంధీ ఇతర పార్టీలవారిపై పరోక్ష విమర్శలు చేశారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నెహ్రూపై కాంగ్రెస్ ఏర్పాటు చేసిన రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు మంగళవారం ముగిసింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమ్మిళిత అభివృద్ధి కోసం నిరంతరం పోరాడాలని పేర్కొన్నారు. ఈ సదస్సులో ఆఫ్గనిస్థాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.




