తిరుమల,(జనంసాక్షి): పరిపాలన కారణాల దృష్ట్యా నేడు జరగాల్సిన డయల్ యువర్ ఈవో కార్యక్రమం రద్దు చేసినటుల తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. అలాగే శనివారం జరగనున్న సహస్రకలశాభిషేకం కూడా రద్దు అయిందని తెలిపింది. శని, ఆదివారాలు వారాంతపు సెలవులు. దాంతో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది.
ఈ నేపథ్యంలో ఆ రెండు రోజుల వీఐపీ బ్రేక్ దర్శనం కూడా రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది. అదిలా ఉండగా టీటీడీ నూతన కార్యనిర్వహాణాధికారిగా ఎంజీ గోపాల్ నియమితులయ్యారు.ఆయన శనివారం ఈవోగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యంను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే.




