విజయనగరం,మే10(జనం సాక్షి): విజయనగరం జిల్లాలో ఈ నెల 11 నుంచి 13 వరకు రాష్ట్రస్థాయి చదరంగం పోటీలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చదరంగం అసోసియేషన్ ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తున్నారు. లార్వెన్ పాఠశాలలో నిర్వహించనున్నట్లు జిల్లా శాఖ అధ్యక్షులు మేకా కాశీ విశ్వేశ్వరుడు
తెలిపారు. ఓపెన్ బాలికల చదరంగం ఛాంపియన్షిపునకు హాజరయ్యే 13 జిల్లాల క్రీడాకారులకు ఉచిత భోజనం, వసతి కల్పించనున్నట్లు చెప్పారు. 11న ఉదయం 11గంటలకు ఎస్పీ జి.పాలరాజు ముఖ్య అతిథిగా హాజరై పోటీలు ప్రారంభిస్తారని, 13 సాయంత్రం 4.30 గంటలకు విజేతలకు బహుమతులు ప్రదానోత్సవం కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు చేతుల విూదుగా జరుగుతుందన్నారు.




