కర్నూలు,ఏప్రిల్1 : జిల్లాలో రెండు రోజలపాటు కేంద్ర కరవు బృందం పర్యటించనుంది. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఈ బృందం పర్యటించనుంది. గురు,శుక్రవారాల్లో ఈ బృందం పర్యటిస్తుందని అన్నారు. కరవు బృందం రాక సందర్భంగా అధికారులతో జాయింట్ కలెక్టర్ సవిూక్షించారు. కేంద్ర కరవుబృందానికి నివేదించనున్న అంశాలపై చర్చించారు. సమగ్ర నివేదికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. కేంద్ర వ్యవసాయశాఖ సంయుక్త కార్యదర్శి డా.పి. షకీల్ అహ్మద్ బృందకర్తగా వ్యవహరించనున్నారు. ఈయనతోపాటు కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుడు నరేంద్రకుమార్, రాష్ట్రం నుంచి కృష్ణా, గోదావరి బేసిన్ సంచాలకుడు పంకజ్‌త్యాగి, ఏపీ ఎఫ్‌సీఐ డీజీఎం గోవర్దన్‌రావు రానున్నారు. కేంద్ర బృందం అనంతపురం నుంచి బయలుదేరి 2న ఉదయం 10.30 గంటలకు కర్నూలు చేరుకుంటుంది.




