నేడు కల్లుగీత కార్మికులకు అవగాహన సదస్సు

అమరావతి,మే2( జ‌నం సాక్షి): ఈ నెల 3వ తేదీన తాటి, కొబ్బరి ఉత్పత్తులపై కల్లుగీత కార్మికులకు జాతీయస్థాయి అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు కల్లుగీత కార్మికుల సహకార ఆర్థిక సంస్థ చైర్మన్‌ జయప్రకాష్‌ నారాయణ చెప్పారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం డచ్‌మాన్‌, జాన్‌డేవిడ్‌ ఆడిటోరియంలో ఈ సదస్సు నిర్వహించనున్నారు. ఈ ఏడాది నుంచి గీత కార్మికులకు భూమి శిస్తు రద్దు చేస్తున్నట్లు జయప్రకాశ్‌ నారాయణ తెలిపారు. తమ కార్పొరేషన్‌ ద్వారా గౌడ, శెట్టిబలిజ, ఈత, ఈడిగ, కులస్తులకు రుణాలు అందజేయనున్నట్లు చెప్పారు. గత సంవత్సరం రూ.35 కోట్లు రుణాలు అందజేసి, 7వేల మందికి ఉపాధి కల్పించామన్నారు.

తాజావార్తలు