Tuesday, 3 November 2026

ప్రణాళికా సంఘానికి కాలం చెల్లింది

మన ఊరు – మన ప్రణాళికను వివరించిన సిఎం కెసిఆర్‌ 2

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 7 (జనంసాక్షి) : దేశం అభివృద్ధికి సరైన ప్రణాళికలు రూపొందించేందుకుగాను ఎప్పుడో ఏర్పాటు చేసిన ప్రణాళికా సంఘానికి కాలం చెల్లిందని, దాని స్థానే కొత్త సంస్థను ఏర్పాటు చేసేందుకు మోడీ కసరత్తు చేస్తున్నారని, అందులో భాగంగానే ఈ ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ అన్నారు. ఈ సమావేశానికి హాజరైన కెసిఆర్‌ మాట్లాడుతూ.. ప్రణాళికా సంఘంపై ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనకు తాను మద్దతు తెలిపానన్నారు. ప్రణాళిక సంఘం స్థానే కొత్త సంస్థను ఏర్పాటు చేయాలని భావిస్తున్న ముఖ్యమంత్రుల మండలి సమర్థవంతంగా పనిచేసేందుకు ప్రత్యేక సెక్రటేరియట్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. సారుప్యత ఉన్న సమస్యలపై ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఉప సంఘాలు ఏర్పాటు చేయాలన్నారు. పంచవర్ష ప్రణాళికల స్థానంలో పది పదిహేనేళ్ల ప్రణాళికలు రూపొందించాలన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న మన ఊరు – మన ప్రణాళికను ప్రధాని మోడీకి వివరించినట్టు కెసిఆర్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *