Tuesday, 3 November 2026

నేడు జూట్‌కార్మికుల చలో అసెంబ్లీ

విజయనగరం,నవంబర్‌16(జ‌నంసాక్షి):రాష్ట్రంలో మూతపడిన జూట్‌మిల్లులు తెరిపించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 17న చలో అసెంబ్లీ నిర్వహించనున్నట్లు ఇఫ్టూ జిల్లా అధ్యక్షుడు కె.సన్యాసిరావు తెలిపారు. జూట్‌మిల్లులు మూతపడడంతో వేలాది మంది కార్మికులు రోడ్డునపడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జూట్‌రంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. విజయనగరం రైల్వేస్టేషన్‌కు నుంచి విజయవాడ వెళ్తామని తెలిపారు.