అనంతపురం,ఫిబ్రవరి20 ( జనంసాక్షి)
: ఈనెల 21 ఉదయం 10 గంటలకు టీటీడీసీ ఆవరణలో ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు పీడీ వెంకటేశం తెలిపారు. జిల్లా గ్రావిూణాభివృద్ధి శాఖ, వెలుగు, ఈజీఎంఎం సంయుక్త ఆధ్వర్యంలో బెంగుళూరు ఏపీసీ కంపెనీలో ప్రొడక్షన్‌లో ఉద్యోగాలను భర్తీ చేస్తారు. దీనికి ఐటీఐ/డిప్లమాలో ఎలక్ట్రికల్, ఎలక్టాన్రిక్స్ విద్యార్హత, కలిగి 18-25 ఏళ్ల మధ్యలో వయసు ఉండాలన్నారు. నెలకు రూ.7వేలు వేతనం, ఓటీ, రెండు పూటల భోజనం, రవాణా వసతి ఉంటుందన్నారు. ఒన్‌జాబ్ ఇండియా కంపెనీలో డేటాఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీ ఉంటుంది. దీనికి 18-35 ఏళ్ల మధ్య వయసు, ఇంటర్, డిగ్రీ, డిఎ/-లొమా విద్యార్హతతో పాటు టైప్‌లో నిమిషానికి 25 పదాలు టైపింగ్ చేసేవారే అర్హులు. నెలకు రూ.6500 నుంచి రూ.7500 వరకు వేతనం, ప్రోత్సాహకం రూ.500 నుంచి రూ.5వేలు వరకు ఉంటుంది. ఈ రెండు కంపెనీల్లో ఉద్యోగంలో చేరేందుకు ఆసక్తి, అర్హత కల్గిన నిరుద్యోగ అభ్యర్థులు ఇంటర్యవ్యూకు హాజరు కావాలన్నారు.




