Thursday, 5 November 2026

పటిష్టంగా రేపటి పల్స్‌పోలియో

అనంతపురం,ఫిబ్రవరి20 ( జ‌నంసాక్షి)
: ఈనెల 22న మలివిడత జరిగే పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని పక్కాగా చేపట్టేందుకు అధికారులు సిద్దం అయ్యారు.  జనవరిలో జరిగిన తొలివిడతలో తలెత్తిన లోపాలను సవరించుకుని ముందుకు వెళ్లాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ప్రభుదాస్‌ ఆదేశించారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. వ్యాక్సిన్‌ క్యారియర్లు, ప్రచార సామాగ్రిని, వ్యాక్సిన్‌ను తక్షణం నిర్దేశిత పీహెచ్‌సీలు, ఆస్పత్రులకు పంపాలని సూచించారు. ఆరోజు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా చూడాలని ఎజెసి ఆదేశించారు. . బస్టాండు, రైల్వేస్టేషన్‌ వంటి జన సంచార ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను నియమించాలన్నారు. అత్యంత పకడ్భందీగా, పటిష్టంగా నిర్వహించాలని ఏ చిన్న లోపం, సమస్య తలెత్తడానికి వీలులేదని ఏజేసీ ఆదేశిరచారు. ఇందుకోసం 15,316 మంది వ్యాక్సినేటర్లు, 360 మంది సూపర్‌వైజర్లను నియమించినట్లు డిఎంహచ్‌వో చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *