Monday, 2 November 2026

నేడు నెల్లూరు జిల్లాకు చంద్రబాబు రాక

నెల్లూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం ఉదయం 11.30 గంటలకు తన నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 12.30 గంటలకు నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పెదకొండూరు గ్రామంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గాన దగ్గర్లోని జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానానికి చేరుకుంటారు. అనంతరం ఉదయగిరి ఎమ్మెల్యే బీవీ రామారావు కుమారుని వివాహ విందు వేడుకల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.15 గంటలకు రోడ్డుమార్గాన పెద్దకొండూరులోని హెలీప్యాడ్‌కు చేరుకుని మధ్యాహ్నం 1.30 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 2.30 గంటలకు తన నివాసానికి చేరుకుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *