Tuesday, 3 November 2026

నేడు మంత్రి వర్గ విస్తరణ

3

కొండాకు డౌట్‌.. మిగిలిదంత యదాతదం

పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా – కొప్పుల ఈశ్వర్‌

 

హైదరాబాద్‌,డిసెంబర్‌15(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర తొలి మంత్రి వర్గ విస్తరణకు ముహుర్తం ఖరారైంది. మంగళవారం ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. కొత్త మంత్రుల పేర్లను తెలంగాణ సర్కార్‌ రాజ్‌భవన్‌కు పంపినట్లు సమాచారం. కొత్తగా ఆరుగురు నేతలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కొత్త మంత్రుల చేత గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. జూన్‌ 2న కెసిఆర్‌ నాయకత్వంలో ఏర్పడ్డ తొలిమంత్రివర్గ ప్రమాణం తర్వాత ఇదే ప్రథమ విస్తరణ కాబోతోంది. ఉన్న అవకాశాల మేరకుకేవలం 6గురికి మాత్రమే విస్తరించుకునే ఛాన్స్‌ ఉంది. దీంతో పలువురు మంత్రిపదవుల కోసం పోటీ పడుతున్నారు. ఇందులో ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పిస్తారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్దమైన నేపథ్యంలో .ఆరుగురు పేర్లను ముఖ్యమంత్రి కెసిఆర్‌ రాజ్‌ భవన్‌ కు పంపినట్లు సమాచారం వస్తోంది. వారిలో తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లె కృష్ణారావు,లక్ష్మారెడ్డి, ఇంద్రకిరణ్‌ రెడ్డి, చందూలాల్‌,తలసాని శ్రీనివాస యాదవ్‌ పేర్లు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతం ఎ మ్మెల్యే కాదు. తలసాని శ్రీనివాస యాదవ్‌ టిడిపి పక్షాన ఎన్నికై టిఆర్‌ఎస్‌ లో చేరారు.ఇంద్రకిరణ్‌ రెడ్డి బిఎస్పి టిక్కెట్‌ తరపున ఎన్నికై,ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు.చందూలాల్‌ గిరిజన కోటాలో మంత్రి అవుతారు.లక్ష్మారెడ్డి,జూపల్లె కృష్ణారావులు మహబూబ్‌ నగర్‌ జిల్లా నుంచి మంత్రులు అవుతారు.విశేషం ఏమిటంటే తుమ్మల, తలసాని లతో పాటు చందూలాల్‌ కూడా గతంలో టిడిపిలో ఉన్నవారే. ఇంద్రకిరణ్‌ రెడ్డి కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చి పోటీచేశారు .జూపల్లె కృష్ణారావు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా ఉండి, తెలంగాణ ఉద్యమం నేపధ్యంలో,కాంగ్రెస్‌ వర్గ రాజకీయాలలో పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చి టిఆర్‌ఎస్‌ లో చేరారు.లక్ష్మారెడ్డి మాత్రం తొలి నుంచి టిఆర్‌ఎస్‌ లోనే ఉన్న నేత.అయితే ఈ దఫా కూడా మహిళలకు కూడా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఉంటుందా లేదా అన్నది అనుమానంగానే ఉంది. మరోవైపు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ తన రాజకీయ భవిష్యత్తు విషయంలో పార్టీ ఏ నిర్ణయం తీసుకొన్నా దానికి కట్టుబడి ఉంటాననిఅన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనకు చీఫ్‌ విప్‌ పదవి కట్టబెట్టడం పై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఈశ్వర్‌ సోమవారం ఉదయం ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో కలుసుకొన్నారు. కొన్ని సవిూకరణాల నేపధ్యంలో మంత్రి పదవి ఇవ్వలేకపోయానని , అసంతృప్తి చెందవద్దని , విూ సేవలకు మంచి గుర్తింపు ఇస్తానని సీఎం కేసీఆర్‌ , ఈశ్వర్‌ ను బుజ్జగించారు. ముఖ్యమంత్రి హావిూతో మెత్తబడ్డ ఈశ్వర్‌, పార్టీ నిర్ణయానికి కట్టుబడ ఉంటానని ముఖ్యమంత్రితో అన్నారు. ముఖ్యమంత్రి తో భేటీ అనంతరం ఈశ్వర్‌ విూడియాతో మాఇట్లాడారు. మాల సామాజిక వర్గంలో ఆవేదన ఉన్నమాట వాస్తవమేనని ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్నారు. తన భవిష్యత్‌ ను కేసీఆరే నిర్ణయిస్తారని ఆయన అన్నారు. సాయంత్రంలోగా ఈ వ్యవహారంపై మరింత స్పష్టత వస్తుందని కొప్పుల తెలిపారు. మంత్రి వర్గ విస్తరణలో మంత్రి పదవి ఖాయమని అనుకొన్న ఈశ్వర్‌ కు ముఖ్యమంత్రి నిర్ణయం తీవ్ర నిరాశకు గురి చేసింది. చీఫ్‌ విప్‌ పదవి అప్పగించడంపై కొప్పుల ఈశ్వర్‌,అనుచరులు తీవ్ర అసంతృప్తిగా వ్యక్తం చేసారు. ఈ నేపథ్యంలో ఆయనకు కేసీఆర్‌ స్వయంగా ఫోన్‌ చేసి కలవాల్సిందిగా సూచించారు. మరోవైపు కొప్పులకు మంత్రి పదవిగాకుండా చీఫ్‌ విప్‌ పదవి ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని ఆయన అనుయాయులు కరీంనగర్‌ జిల్లాలో ఆదివారం పలుచోట్ల ఆందోళనకు దిగారు. కేసీఆర్‌ దిష్టిబొమ్మలను దహనం చేశారు. మాల మహానాడుకు చెందిన నాయకులు, కార్యకర్తలు కరీంనగర్‌ కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేశారు. నలుగురు కార్యకర్తలు కలెక్టరేట్‌ భవనం ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. అలాగే ధర్మపురికి చెందిన ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈశ్వర్‌ కు మంత్రి పదవి దక్కకపోవడంపై మాల మహానాడు అధ్యక్షులు కారెం శివాజి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. మాలలకు అన్యాయం చేయాలనే ఉద్తదేశంతోనే కేసీఆర్‌ , ఈశ్వర్‌ ను పక్కనబెట్టారని ఆయన ఈరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *