Monday, 2 November 2026

నేడు సుదీర్ఘ కెబినెట్‌ సమావేశం

C

– కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

నేడు తెలంగాణ కేబినేట్‌ భేటీ

సుదీర్ఘంగా చర్చించే అంశాలు ఎన్నో

హైదరాబాద్‌,జనవరి 2(జనంసాక్షి): గ్రేటర్‌ ఎన్నికలే ఎజెండగా తెలంగాణ కేబినేట్‌ భేటీ  సమావేశం శనివారం సుదీర్ఘ ఎజెండాతో జరగనుంది. ఈ మేరకు సిఎం కెసిఆర్‌ అధ్యక్షతన జరిగే సమావేశంలో చర్చించే అంశలను ఖరారు చేశారు. దాదాపు వందకు పైగా అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. ప్రధానంగా జంటనగరాల్లో పేదల ఇంటిపన్ను తగ్గింపు, విద్యుత్‌,నీటి బకాయిల రద్దు తదితర అంశలు ప్రధానంగా చోటుచేసుకోనున్నాయి. గ్రేటర్‌  ఎన్నికలు తెరాస ప్రభుత్వానికి ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ప్రజలను ఆకట్టుకునేందుకు పెద్దఎత్తున వరాల జల్లు కురిపించాలని సర్కారు భావిస్తోంది. ఆస్తిపన్ను తగ్గింపు, స్థలాలు, అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు నిర్ణయం తీసుకొని గురువారమే ఉత్తర్వులు జారీ చేసింది. వీటికి మంత్రిమండలిలో ఆమోదం తెలపనున్నారు. ఇవిగాక విద్యుత్‌, నీటి బకాయిల మాఫీనీ ఆమోదించనున్నారు. హైదరాబాద్‌ నగరంలో ఇళ్ల నిర్మాణాలు, పలు ఇతర నిర్మాణాలు, మౌలిక వసతులు, మంజూరులకు సంబంధించిన అంశాలు కూడా ఎజెండాలో ఉన్నాయి. అలాగే  కాంట్రాక్ట్‌  ఉద్యోగుల క్రమబద్ధీకరణ, డిఎస్సీ నిర్వహణ తదితర అంశాలపై కేబినేట్‌ చర్చించనుంది. ఇందుకోసం మంత్రిమండలి సుదీర్ఘంగా భేటీ కానుంది.  వరసగా వచ్చిన ఎన్నికల ప్రవర్తన నియమావళులు, మరికొన్ని రోజుల్లో మళ్లీ రాబోయే గ్రేటర్‌ ఎన్నికల నియమావళిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం పెండింగులో ఉన్న అంశాలతో పాటు కొత్తవాటిని మంత్రిమండలి ఎజెండాలో చేర్చాలని నిర్ణయించింది. దీంతో సుదీర్ఘంగా చర్చించి నిర్ణయాలను ప్రకటించనుంది. చర్చించాల్సిన  అంశాలతో జాబితా సిద్ధమైంది. పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ పరిధిలో మరికొన్ని పోస్టుల నియామకాలు, డీఎస్సీ నియామకాలు, పొరుగుసేవల ఉద్యోగుల వేతనాల పెంపు వంటివి ఎజెండాలో ఉన్నాయి. విశ్వవిద్యాలయాల చట్టసవరణ, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు, బీసీ కమిషన్‌ మార్గదర్శకాలు సహా అనేక రాష్ట్రస్థాయి అంశాలు జాబితాలో ఉన్నాయి. కరవు, ప్రత్యామ్నాయ ప్రణాళికలు, ప్రాజెక్టుల పునరాకృతి, నీటిపారుదల రంగానికి సంబంధించిన మరికొన్ని నిర్ణయాలపైనా సమావేశంలో చర్చించనున్నారు.  కాంట్రాక్ట్‌  ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఎన్నికల సందర్భంగా తెరాస హావిూ ఇచ్చింది. మిగిలిన హావిూలపై చర్యలు తీసుకున్నా… ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశంపై ఎలాంటి పక్రియ మొదలుకాలేదు. రెండో తేదీన జరిగే మంత్రిమండలి సమావేశంలో దీనికి మోక్షం లభించనుంది. అన్నిశాఖల నుంచి జాబితాను సేకరించి, మంత్రిమండలిలో ఆమోదం తెలపనున్నారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు సుదీర్ఘంగా  కొనసాగుతుంది. మధ్యాహ్న భోజనాన్ని సమకూర్చనుంది. సమావేశం ముగిసే వరకు అధికారులను బయటికి వెళ్లే అవకాశం ఉండదని తెలిపింది. సమావేశంలో చర్చించిన అనంతరం వివరాలను వెల్లడిస్తారు. ఇదిలావుండగా రైతు సంక్షేమం దిశగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఖరీఫ్‌ నుంచి వ్యవసాయానికి పగటిపూట తొమ్మిది గంటలు విద్యుత్‌ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఇతర వర్గాలకు నిరంతరాయ విద్యుత్‌ సరఫరా చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. అందుకోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. నూతన సంవత్సరం ప్రారంభం రోజున విద్యుత్‌ శాఖపై సీఎం కేసీఆర్‌ సచివాలయంలో మొదటి సవిూక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో నిరంతర విద్యుత్‌ సరఫరాను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు సీఎం కేసీఆర్‌ ప్రణాళికలు రచిస్తున్నారు. అధికారం చేపట్టిన కొద్దినెలల్లోనే తెలంగాణలో దశాబ్ధాల విద్యుత్‌ సమస్యను తరిమికొట్టిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. దానిని పటిష్టం చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే రాష్ట్రమంతటా కోతల్లేని విద్యుత్‌ అందిస్తూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని వర్గాల నుండి ప్రశంసలు పొందుతోంది. రెప్పపాటు కూడా కోతలు లేకుండా కరెంటు అందించాలన్న ముఖ్యమంత్రి స్వప్నం మరింత పటిష్టంగా అమలు కానుంది. ప్రస్తుతం 4,445 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం ఉందని సీఎం కేసీఆర్‌ కు అధికారులు తెలిపారు. ఏడాది చివరి నాటికి మరో 4,600 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నందున దానికి తగ్గట్లు పనులు చేస్తున్నామన్నారు. భూపాలపల్లిలో ఈ నెల 5న 600 మెగావాట్ల యూనిట్‌ ను ప్రారంభించడంతో పాటు ఏప్రిల్‌ నాటికి జైపూర్‌ నుంచి మరో 1200 మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి వస్తుందని అధికారులు చెప్పారు. ఛత్తీస్‌ గఢ్‌ నుంచి రావాల్సిన వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ కూడా ఈ ఏడాది చివరి నాటికి అందుతుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఏప్రిల్‌ నాటికే 800 మెగావాట్లు.. ఏడాది చివరి నాటికి మరో 2000 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ కూడా అందుతుందన్నారు. మొత్తంగా ఈ ఏడాది చివరి నాటికి అదనంగా మరో 4600 మెగావాట్ల విద్యుత్‌ అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం కేసీఆర్‌ కు అధికారులు వివరించారు బీహెచ్‌ఈఎల్‌ ద్వారా నిర్మించే పవర్‌ ప్రాజెక్టుల పనులు వేగం పుంజుకోవాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. నిర్ణీత లక్ష్యాల మేరకు విద్యుత్‌ అధికారులు పనిచేస్తున్నారని అభినందించారు. 2018 వరకు 25 వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యంగా రూపొందించుకున్న ప్రణాళిక ప్రకారం అధికారులు పనిచేయాలని సీఎం కేసీఆర్‌ సూచించారు.

జెన్‌ కో సీఎండీ ప్రభాకర్‌ రావు, ప్రాజెక్ట్స్‌ డైరెక్టర్‌ రాధాకృష్ణతో పాటు ఇతర అధికారుల ఈ సమావేశానికి హాజరయ్యారు.

గ్రేటర్‌ ఎన్నికలే ప్రధాన ఎజెండాగా కేబినెట్‌ !

తెలంగాణ క్యాబినెట్‌ రేపు సమావేశం కానుంది. సంక్షేమ పథకాల అమలు తీరు, బడ్జెట్‌ రూపకల్పనపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇక గ్రేటర్‌ ఎన్నికలే లక్ష్యంగా పలు వరాలు ప్రకటించనున్నారు. దీంతో పాటు క్యాబినెట్‌లో పలు వివాదాస్పద అంశాలపైనా చర్చించనున్నారు.

ఉదయం 11 గం.ల నుంచి సాయంత్రం 4.30 వరకు భేటి..

సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ మంత్రివర్గం శనివారం ఉదయం సచివాలయంలో సమావేశం అవుతుంది. సుదీర్ఘ కాలం తర్వాత జరుగుతున్న సమావేశం కావడంతో అజెండా భారీగా ఉంది. అందుకే ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సమావేశం సాయంత్రం దాదాపు నాలుగున్నర వరకు జరిగనుంది.

గ్రేటర్‌ ఎన్నికలపైనే కేబినెట్‌లో ప్రధాన చర్చ …….

మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా గ్రేటర్‌ ఎన్నికలపైనే ప్రధాన చర్చ సాగనున్నట్లు సమాచారం. గ్రేటర్‌ ప్రజలపై ఇప్పటికే వరాల జల్లు కురించింది ప్రభుత్వం. మరిన్ని అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశముంది. దాంతో పాటు గ్రేటర్‌ ఎన్నికల ఇంచార్జ్‌ గా మంత్రి కేటీఆర్‌ ను లాంఛనంగా ప్రకటించబోతోంది మంత్రిమండలి.

సంక్షేమ పథకాల అమలుపై సవిూక్ష …….

మరోవైపు రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు తీరును కూడా సవిూక్ష చేస్తారు. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పనులపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిది. సకాలంలో ఆయా పనులు పూర్తి అయ్యేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. కాంట్రాక్ట్‌ కార్మికుల క్రమబద్దీకరణతో పాటు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీత భత్యాలను ఎంత మేర పెంచాలన్న దానిపై నిర్ణయం తీసుకోనుంది. 15 నుంచి 20 వేల వరకు టీచర్‌ ఉద్యోగుల భర్తీకి సైతం ఆమోదం తెలపనుంది.

బడ్జెట్‌ సమావేశాల నిర్వహణపై చర్చ…….

ఇక ఇదే నెల నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్‌ సమావేశాల నిర్వహణపై సైతం చర్చించనుంది మంత్రివర్గం. శాఖల పరంగా ప్రాధాన్యతలను సైతం సీఎం వివరించనున్నారు. బడ్జెట్‌ సమావేశాల్లో విపక్షాల నుంచి ఎదురయ్యే విమర్శలకు ధీటుగా సమాధానమిచ్చేలా మంత్రులు సొంత శాఖలపై పట్టు సాధించేలా సీఎం దిశా నిర్దేశం చేయనున్నారు.

ఓమ్‌ సిటీకి 500 ఎకరాల స్థలం కేటాయించడంపై చర్చ ………….

రామోజీ ఫిల్మ్‌ సిటీకి అనుకుని నిర్మించ తలపెట్టిన దేవనగరి…ఓమ్‌ సిటీకి 500 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించే అంశంపై చర్చజరగనుందని సమాచారం. శనివారం నాటి మంత్రిమండలి సమావేశంలో దీనికి పచ్చ జెండా ఊపనున్నారని సమాచారం. వీటితో పాటు మరిన్ని అంశాలపై కేబినెట్‌లో చర్చలు సాగనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *