హైదరాబాద్:
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను పట్టి పీడిస్తున్న సమస్యల పరిష్కారం కోసం టీఎస్ సర్కార్ కంకణం కట్టుకున్నట్లుగా కన్పిస్తోంది. ఇందుకు తగ్గట్లుగానే సీఎం కేసీఆర్ నేడు జిహెచ్ ఎంసి పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులతో భేటీ అవుతున్నారు. ఉదయం 11.30 నిముషాలకు జూబ్లీహిల్స్ లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల భవనంలో సీఎం కేసీఆర్ జరపనున్న ఈ సమీక్షలో గ్రేటర్ సమస్యలే ప్రధాన ఎజెండా..
నేడు హైదరాబాద్,సికింద్రబాద్ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ సమీక్ష




