Tuesday, 3 November 2026

నేతాజీ రహస్య పత్రాలు బహిర్గతం

C

– జయంతి రోజే విడుదల చేసిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ,జనవరి23(జనంసాక్షి):ఎట్టకేలకు  నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌కు సంబంధించిన రహస్య పత్రాలు వెల్లడయ్యాయి. ఇంతకాలం మిస్టరీగా ఉన్న ఈ  దస్త్రాలను ప్రధాని నరేంద్ర మోదీ బహిర్గతం చేశారు.  సుభాష్‌ చంద్రబోస్‌ కుటుంబసభ్యుల సమక్షంలో భారత జాతీయ ప్రాచీన పత్ర భాండాగారం(ఎన్‌ఏఐ)లో దస్త్రాలను విడుదల చేశారు.  నేతాజీ జన్మదినం సందర్భంగా విడుదల చేసిన దస్త్రాలను చూసి ఆయన కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. నేతాజీ జీవితానికి సంబంధించిన వంద రహత్య దస్త్రాలను డిజిటల్‌ పత్రాల రూపంలో బహిర్గతం చేశారు. ఈ కార్యక్రమానికి 12 మంది నేతాజీ కుటుంబసభ్యులు హాజరయ్యారు. 70ఏళ్ల క్రితం నేతాజీ కనిపించకుండా పోయినప్పటి నుంచి ఆయన గురించి మిస్టరీగా మారిన సంగతి తెలిసిందే. నేతాజీ మరణంపై గతంలో వేసిన రెండు దర్యాప్తు కమిషన్‌లు… ఆయన తైపీలో 1945, ఆగస్టు 18న జరిగిన విమాన ప్రమాదంలో మరణించినట్లు తెలిపాయి. కానీ ఆయన కుటుంబసభ్యులు, మరికొందరు ఈ విషయాన్ని అంగీకరించడంలేదు. ఆయనకు సంబంధించిన పూర్తి సమచారం కోసం దస్త్రాలను బహిర్గతం చేయాలని కోరిన విషయం తెలిసిందే. ఇప్పటికే బెంగాల్‌ ప్రభుత్వం కొన్ని పత్రాలను విడుదల చేసింది. కానీ అందులో నేతాజీ మరణానికి సంబంధించి ఎలాంటి వివరాలులేవు. ఇప్పుడు ప్రధాని విడుదల చేసిన పత్రాల్లో కూడా వివరాలను కూడా నెట్‌లో పెట్టారు. దీనికి సంబంధించి వివిధ దేశాలను సంప్రదించి వారిచ్చిన సమాచారాం ఆధారంగా ఈ పత్రాలను విడుదల చేశారు. ఇదిలావుంటే నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌కి ప్రధాని నరేంద్రమోదీ నివాళులర్పించారు. సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను మోదీ కొనియాడారు. నేతాజీ ధైర్యసాహసాలు, దేశభక్తిని భారతీయులందరూ గుర్తుచేసుకోవాలని సూచించారు. ఈ మేరకు మోదీ ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు. కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తదితరులు నేతాజీకి నివాళులర్పిస్తూ.. ట్వీట్‌ చేశారు. నేతాజీ జయంతి సందర్భంగా ఆయనకు సంబంధించిన దస్త్రాలను మోదీ బహిర్గతం చేయడం విశేషం. ఇదిలావుంటే పారల్మెంట్‌ హౌజ్‌లో నేతాజీకి అద్వానీ, స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌,వెంకయ్యనాయుడు తదితరులు నివాళి అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *