Tuesday, 3 November 2026

న్యాయం, సలహా, సహాయం కోసం టోల్‌ఫ్రీ

zrmz2dweన్యాయం కోసం, సహాయం, సలహా… అన్నీ ఉచిత పోన్‌కాల్స్‌తో పొందవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం టోల్‌ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కానీ సకాలంలో ఎవ్వరికీ ఈ నెంబర్లపై పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు. ఈ నెంబర్లకు ఫోన్‌చేసి పైసా ఖర్చు లేకుండా పలు సేవలను వినియోగించుకోవచ్చు. ఇవి ప్రజాప్రయోజనార్థం ఏర్పాటు చేసినవే. భాధితులు, సమాచారం అవసరమైన వారు మాత్రమే కాల్ చేయాలి. ఆకతాయిగా ఫోన్‌చేస్తే అసలైనవారికి అందే సేవల్లో జాప్యం జరుగుతుంది. టోల్‌ఫ్రీ నంబర్లు, వాటి ద్వారా అందే సమాచారం, సేవలు తెలుసుకుందామా.
కళ్లముందు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించలేని పరిస్థితితో పోలీసుల నుంచి తక్షణ సహాయం పొందేందుకు 100 నంబరుకు ఫోన్‌చేయవచ్చు. గృహహింస, వరకట్న వేధింపుల గురించి ఫిర్యాదు చేయడానికి మహిళలకు ఇది ఉపయోగపడుతుంది. నేర సంబంధ సమాచారాన్ని1090 నంబర్‌కు ఫోన్ చేసి తెలపాలి. ఇతరుల నుంచి ఇబ్బందులు, అసాంఘిక శక్తుల కార్యకలాపాలు, వేధింపులు, జాదం, వ్యభిచారం, ఇతర మహిళలను ఇబ్బందులకు గురిచేసే వాటిపై ఫిర్యాదు చేయవచ్చు.
అగ్రిప్రమాదం సంభవించినప్పుడు వెంటనే 101 నంబర్‌కు ఫోన్‌చేసి సమాచారం అందించాలి. ప్రకృతి వైపరీత్యాలు ఏర్పాడినప్పుడు ఈ నంబర్‌లో సంప్రదించవచ్చు.
ఎక్కడైనా ప్రమాదం జరిగినా, ఎవరైనా తీవ్ర అనారోగ్యానికి గురైనా తక్షణ వైద్యసేవల కోసం 108 నంబర్‌కు ఫోన్‌చేయవచ్చు.కాల్ చేసిన కొన్ని నిమిషాల్లోనే అంబులెన్స్ వస్తుంది. రావడం ఆలస్యమైతే మళ్లీ కాల్ చేయవచ్చు.
నగరంలోని వ్యవసాయశాఖ కమిషనరేట్‌లో ఉండే 18004253536 నంబర్‌కు కాల్ చేస్తే ఒక నిమిషం పాటు రైతు చెప్పిన సమస్యలు, సూచనలు రికార్డు చే స్తుంది. ఆ రైతు ఫోన్ నం బర్, పేరు, ఊరు తెలుసుకుని ఏ రోజుకారోజు స మాచారాన్ని తిరిగి పంపిస్తారు. స్థానిక వ్యవసాయ అధికారుల సహాయం అందుతుంది.
రైల్వే రిజర్వేషన్లు,రైళ్ల వేళలు తదితర వివరాలను 139 నంబర్‌కు ఫోన్‌చేసి తెలుసుకోవచ్చు.రైల్వేస్టేషన్‌లో రైళ్ల రాకపోకల సమాచారం తెలుసుకోవచ్చు.కాని నిమిషానికి రూ.2 చార్జీ చెల్లించాల్సి ఉంటుంది.
రైలులో ప్రయాణిస్తున్నప్పుడు అపాయము జరిగితే 138కి ఫోన్‌చేసి సహాయం పొందవ చ్చు. రైల్వే అధికారులకు సమాచారం అం దించడానికి ఉపయోగపడుతుంది.
ఇటీవల ప్రవేశపెట్టిన మీ-సేవ పథకం అ మలు తీరును తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్‌చేయవచ్చు. ఆయా ఆ ప్రాంతాల్లో పథకానికి సంబంధించి సమస్యలుంటే ఫిర్యాదు చేయవచ్చు.
టెలికం శాఖకు సంబంధించిన ఫోన్‌ల సమస్యలు తలెత్తితే 198 నంబర్‌కు ఫిర్యాదు చే యవచ్చు. శా ఖాపరం గా తగిన సమాచారం, సహాయం పొందేం దుకు టెలికాం విభాగం సేవలకు ఫోన్‌చేయవచ్చు.
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సేవలపై 18002004599 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు.ఆర్టీసీ బస్సులో కలిగే అసౌకర్యాలు, సిబ్బంది ప్రవర్తన గురించి ఈ నంబర్‌కు ఫోన్‌చేసి చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *